Temjen Imna Along: మోదీ, నేను.. ఎందుకు నవ్వుతున్నామో చెప్పండి..!
నాగాలాండ్ మంత్రి తెమ్జెన్(Temjen Imna Along) తన చమత్కార పోస్టులతో ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన చేసిన పోస్టు కూడా ఆ కోవలోనిదే.
దిల్లీ: చమత్కారాలు విసురుతూ, జోకులు పేలుస్తూ నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటారు నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along). తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ(Modi)తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసి.. తామిద్దరం ఎందుకు నవ్వుతున్నామో చెప్పండి చూద్దాం అని నెటిజన్లను అడిగారు.
‘గురువుతో ఉంటే చింతించాల్సిన పని ఏముంది. అగ్రనేతల నుంచి జ్ఞానాన్ని పొందడం గొప్ప గౌరవం. మేమిద్దరం ఎందుకు నవ్వుతున్నామో చెప్పండి చూద్దాం’ అని మోదీతో దిగిన చిత్రాన్ని ఉద్దేశించి తెమ్జెన్ పోస్టు పెట్టారు. దీనిపై విపరీత స్పందన వచ్చింది. ‘మిమ్మల్ని కలుసుకోవడమే నిజమైన సంతోషం. అక్కడ మీ నవ్వులకు అదే కారణం కావొచ్చు’, ‘మీ చిన్నప్పటి వీడియో ఏదైనా చూపించారా..?’ ‘గురువు గారూ.. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగి ఉంటారు’ అని పలువురు కామెంట్లు పెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!