Temjen Imna Along: నిద్రపోవట్లే..ఫోన్‌ చూస్తున్నా: మంత్రి ఛలోక్తి

నాగాలాండ్(Nagaland) మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌(Temjen Imna Along) పోస్టులు నెట్టింట్లో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. 

Updated : 27 Mar 2023 22:12 IST

కోహిమా: ఆనంద్ మహీంద్రా, హర్ష గోయెంకా మాదిరిగా ట్విటర్‌లో చురుగ్గా ఉంటూ, హాస్యం పండిస్తుంటారు నాగాలాండ్(Nagaland) మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌(Temjen Imna Along). తాజాగా ఆయన తన ఫొటోను షేర్ చేసి, నెట్టింట్లో నవ్వులు పంచారు. 

తెమ్జెన్ షేర్ చేసిన చిత్రంలో ఆయన ఫోన్ చూస్తూ నిద్ర పోతున్నట్లు ఉంది. దానిని ట్విటర్ వేదికగా షేర్‌చేసిన ఆయన.. ‘నేను నిద్రపోవడం లేదు. తర్వాతి ట్వీట్‌ను టైప్ చేస్తున్నా’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేశారు. ఈ పోస్టుపై కామెంట్ల వర్షం కురిసింది. ‘నేను చదువుకుంటూ ఉన్నప్పుడు నా కళ్లు మూతలు పడుతుంటాయి. అప్పుడు మా అమ్మానాన్నకు దొరికిపోయి ఇలాగే చెప్తాను. కళ్లుమూసుకొని నేను చదివినవన్నీ మననం చేసుకుంటున్నానని చెప్పేస్తుంటా’  అని ఒకరు రాసుకొచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని