Pravasi Bharatiya Diwas:దేశానికి నిజమైన ప్రతినిధులు ప్రవాస భారతీయులే

దేశాభివృద్ధికి తోడ్పడేందుకు ప్రవాస భారతీయులు తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రవాస భారత దినోత్సవం పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి.. ఎన్నారైల విజయాలను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు...

Published : 09 Jan 2022 16:20 IST

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాభివృద్ధికి తోడ్పడేందుకు ప్రవాస భారతీయులు కృషి చేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రవాస భారత దినోత్సవం పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి.. ఎన్నారైల విజయాలను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రపంచ దృష్టికోణానికి నిజమైన ప్రతినిధులు ప్రవాస భారతీయులేనని కొనియాడారు. వారంతా.. దేశ సాంస్కృతిక రాయబారులుగా కొనసాగాలని కోరారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో.. దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి సెక్రెటేరియట్ ట్వీట్ చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రవాస భారతీయుల సేవలను కొనియాడుతూ.. శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎన్నారైలు ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ రంగాల్లోనూ రాణిస్తున్నారు. అదే సమయంలో.. తమ మూలాలను మర్చిపోలేదు. వారి విజయాలకు గర్విస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు. దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారానికి గుర్తుగా ఏటా జనవరి 9న ప్రవాస భారత దినోత్సవం నిర్వహిస్తుంటారు. 1915లో ఈ రోజునే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చి.. తదనంతరం స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించడం విశేషం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని