Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి.. స్పందించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి తన అల్లుడు రిషి సునాక్ సాధించిన విజయంపై స్పందించారు.
దిల్లీ: బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ ఘనతపై ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ క్రమంలో తన అల్లుడి విజయంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి స్పందించారు.
‘బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషికి నా శుభాకాంక్షలు. ఆయనపట్ల చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసిస్తున్నాను’ అని నారాయణ మూర్తి అన్నారు.
రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి.. నారాయణ మూర్తి కుమార్తె. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే సమయంలో ఆమెకు రిషితో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మనసులు కలవడంతో పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shubman Gill: అతడి ప్రశంసలకు గిల్ పూర్తి అర్హుడు: పాక్ మాజీ కెప్టెన్
-
World News
USA: మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా
-
General News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్
-
India News
Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను