అంగారకుడిపై రోవర్‌ దిగిన వీడియో విడుదల

అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్ధారించడానికి అమెరికా పంపిన 'పర్సెవరెన్స్‌' రోవర్‌ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్‌' అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్‌ అయిన క్షణాలు ఈ

Updated : 23 Feb 2021 04:09 IST

అమెరికా: అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్ధారించడానికి అమెరికా పంపిన 'పర్సెవరెన్స్‌' రోవర్‌ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్‌' అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్‌ అయిన క్షణాలు ఈ వీడియోలో రికార్డు అయ్యాయి. రోవర్‌ ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్‌ కిందకి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ‘పర్సెవరెన్స్’‌ రోవర్‌ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఈరోవర్‌లో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లును ఇంజినీర్లు అమర్చారు. రోవర్‌ ల్యాండింగ్‌ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఇంజినీర్లు స్విచ్‌ ఆన్‌ చేశారు. రానున్న కొద్ది రోజుల్లో రోవర్‌ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు, వీడియో రికార్డింగ్‌లను వెలువరిస్తామని చెప్పిన మూడు రోజులకే నాసా తాజాగా ఈ వీడియో విడుదల చేసింది. ఇప్పటికే పర్సెవరెన్స్‌ అరుణ గ్రహ ఉపరితలానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలు పంపిన సంగతి తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని