National Anthem: ఇకపై జమ్మూకశ్మీర్‌ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లోని అన్ని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని విధిగా పాడాలని విద్యా శాఖ ఆదేశించింది.

Updated : 14 Jun 2024 19:58 IST

శ్రీనగర్: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని (National Anthem) పాడుతారు. అయితే, జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లోని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని కచ్చితంగా ఆలపించాలనే నియమం లేదు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో ఈ గీతాన్ని తప్పనిసరి చేయాలని జమ్మూ కశ్మీర్ పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఉదయం నిర్వహించే అసెంబ్లీ విద్యార్థుల మధ్య ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

ఈ సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం కోసం వక్తలను ఆహ్వానించాలని సూచించారు. విద్యార్థులకు సమాజంలోని పరిస్థితులు, భిన్నమైన సంస్కృతులు, చారిత్రక విషయాలు, పర్యావరణంపై అవగాహన వంటి 16 అంశాలను పాఠశాలల్లో తప్పనిసరిగా పాటించాలని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు