పల్స్‌ పోలియో తేదీ ఖరారు

జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జనవరి 31న నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ.........

Updated : 15 Jan 2021 15:38 IST

దిల్లీ: జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జనవరి 31న నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జనవరి 17 నిర్వహించాలని తొలుత కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి భారీ ఎత్తున కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని మార్చినట్టు తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. అయితే, జనవరి 30న ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ కొందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి..

భారత్‌లో 96శాతం రికవరీ రేటు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని