MiG 29K: గోవాలో కుప్పకూలిన నావికాదళం మిగ్-29కే విమానం..!

నావికాదళానికి చెందిన మిగ్‌ 29 కే విమానం బుధవారం కుప్పకూలింది. సాధారణ సార్టీల్లో భాగంగా గోవా తీరం నుంచి గాల్లోకి ఎగిరిన ఈ విమానం తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది.

Updated : 12 Oct 2022 13:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నావికాదళానికి చెందిన మిగ్‌ 29కే విమానం బుధవారం కుప్పకూలింది. సాధారణ సార్టీల్లో భాగంగా గోవా తీరం నుంచి గాల్లోకి ఎగిరిన ఈ విమానం తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు పైలట్లు విమానాన్ని వదిలేసి సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనపై బోర్డ్‌ ఆఫ్‌ ఎంక్వైరీ (బీవోఐ)కి ఆదేశాలు జారీ చేసినట్లు నావికాదళం పేర్కొంది. 2019 నుంచి మిగ్‌-29కే విమానం కూలడం ఇది నాలుగోసారి. ఈ విమానంలో రష్యాలో తయారు చేసిన కే-36డీ-3.5 ఎజెక్షన్‌ సీట్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటిని అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు.

* 2020 నవంబర్‌లో మిగ్‌-29కే విమానం కూలి ఒక పైలట్‌ మరణించగా.. మరో పైలట్‌ను కాపాడారు. ఈ ఘటన జరిగిన 11 రోజుల తర్వాత గానీ మరణించిన పైలట్‌ నిషాంత్‌ సింగ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. 

* ఇక 2020 ఫిబ్రవరిలో మిగ్‌-29కేను పక్షి ఢీకొంది. దీంతో పైలట్లు శ్రమించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి ఎజెక్ట్‌ అయ్యారు.

* 2019లో గోవాలోని ఓ గ్రామ శివారులో నావికాదళానికి చెందిన మిగ్‌ 29కే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి పైలట్లు సరక్షితంగా బయటపడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని