Nawazuddin Siddiqui: నా భర్త మమ్మల్ని గెంటేశాడు.. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దీఖి భార్య ఆరోపణ

‘‘నా భర్త నన్ను, నా పిల్లల్ని ఇంటి నుంచి గెంటేశాడు’’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దీఖి (Nawazuddin Siddiqui) భార్య ఆలియా (జైనబ్‌) శుక్రవారం ఆరోపించారు.

Updated : 04 Mar 2023 06:51 IST

ముంబయి: ‘‘నా భర్త నన్ను, నా పిల్లల్ని ఇంటి నుంచి గెంటేశాడు’’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దీఖి (Nawazuddin Siddiqui) భార్య ఆలియా (జైనబ్‌) శుక్రవారం ఆరోపించారు. గుమ్మంలో కాపలాదారులను పెట్టి మరీ తమను లోనికి అనుమతించలేదంటూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వరుస వీడియోలను పోస్ట్‌ చేశారు. ఈ దంపతుల కుమారుడు (7), కుమార్తె (12) కూడా అందులో కనిపిస్తున్నారు. అధికారులు పిలిచారని తాను వెర్సోవా పోలీస్‌స్టేషనుకు వెళ్లొచ్చేలోపు ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆలియా ఆరోపణలను నవాజుద్దీన్‌ సిద్దీఖి ప్రతినిధి ఖండించారు. ఆ ఇల్లు నటుడి తల్లి పేరిట ఉన్నందున ఇందులో సిద్దీఖి ప్రమేయం ఏమీ లేదన్నారు. సిద్దీఖి దంపతుల వివాదం గత నెల బాంబే హైకోర్టులో విచారణకు రాగా.. మైనర్లు అయిన ఇద్దరు పిల్లలను దృష్టిలో పెట్టుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. మరోవైపు.. సిద్దీఖి తన పిల్లల ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషను దాఖలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని