ఫరూక్‌ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్‌

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ట్విటర్‌లో

Published : 30 Mar 2021 12:00 IST

శ్రీనగర్‌: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘మా నాన్నకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. దీంతో నేను, మా కుటుంబసభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. గత కొద్ది రోజులుగా మమ్మల్ని కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా’’అని ఒమర్‌ ట్వీట్‌ చేశారు.

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో వైరస్‌ విపరీతంగా విజృంభిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలంతా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. మాస్క్‌లు, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని