Published : 24 Jun 2022 22:14 IST

Agnipath: అగ్నిపథ్లో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు

దిల్లీ: సాయుధ బలగాల నియామక ప్రక్రియ ‘అగ్నిపథ్​’ (Agnipath) పథకంలో ఎన్​సీసీ (NCC) క్యాడెట్​లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్​ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్​పాల్ సింగ్ వెల్లడించారు. ఎన్​సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్​ ఉన్నవారందరికి బోనస్​ పాయింట్లు లభిస్తాయని పేర్కొన్నారు. గ్వాలియర్​లో జరిగిన ఎన్‌సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో గుర్బీర్​పాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎన్​సీసీ అధికారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

‘అకాడమీలో మూడు నెలల శిక్షణ తీసుకున్న 122 మంది యువతులు దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికారులుగా వెళ్తున్నారు. సాయుధ దళాల్లో యువత ఎక్కువ సంఖ్యలో చేరేలా కృషి చేయాలి’ అని ఎన్​సీసీ మహిళా అధికారులకు గుర్బీర్​పాల్ సూచించారు. 1950 నుంచి ఎన్‌సీసీలో మహిళా క్యాడెట్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

సాయుధ బలగాల్లో యువతను చేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న ఈ కొత్త పథకాన్ని తీసుకురాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సహా బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కానీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పింది. నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టంచేసింది. వాయుసేనలో అగ్నిపథ్‌ కింద నియామకాల కోసం రిజిస్ట్రేషన్లు నేటి నుంచి మొదలయ్యాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని