ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేయండి: కేంద్రం
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
దిల్లీ: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ రీసెర్చ్ సంస్థల సాయంతో వీలైనన్ని ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సేవలనూ వినియోగించుకోవచ్చని చెప్పింది. అన్ని రాష్ట్రాలూ వీలైనన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు తగిన భృతి ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తున్న ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, అధిక ధరలకు వ్యాక్సిన్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. 18 -45 ఏళ్ల మధ్య వయస్సువాళ్లు కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునేలా అవగాహన కల్పించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఐసోలేషన్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరింది. దీనివల్ల చిన్నపాటి లక్షణాలు కనిపించిన బాధితులు, సాయం చేసేందుకు ఇంట్లో ఎవరూ లేని బాధితులకు మేలు జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడింది.
కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన కొవిన్ పోర్టల్ ప్రస్తుతం బాగానే పని చేస్తోందని, రిజిస్ట్రేషన్ల సమయంలో లోడును తట్టుకునేలా దీనిని రూపొందించామని కొవిడ్ 19 టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్మెంట్ సాధికార గ్రూప్ ఛైర్మన్ డా.ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని, లేదంటే మొత్తం పోర్టల్‌పైనే దీని ప్రభావం పడే అవకాశముందని ఆయన అన్నారు. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చాలా మంది బాధితులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సరైన సమయంలో ఆక్సిజన్ లభించక పోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో.. ఓవైపు దేశీయ ప్లాంట్ల ఉత్పత్తి సమార్థ్యాన్ని పెంచుతూనే.. సింగపూర్ లాంటి దేశాల నుంచి ఆక్సిజన్‌ను తెప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!