NEET PG 2022 results: నీట్‌ పీజీ ఫలితాలు విడుదల

పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెలలో నిర్వహించిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష- 2022 ఫలితాలు...

Published : 01 Jun 2022 21:09 IST

దిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెలలో నిర్వహించిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష- 2022 ఫలితాలు వచ్చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. మే 21న ఈ పరీక్ష జరగ్గా.. కేవలం పది రోజుల వ్యవధిలోనే నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎన్‌బీఈ) ఈ ఫలితాలను విడుదల చేయడం విశేషం. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మన్‌సుఖ్‌ మాండవీయ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. షెడ్యూల్‌ కన్నా ముందుగానే కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడంలో విశేష కృషి చేసిన అధికారుల పని తీరును ఆయన ప్రశంసించారు. నీట్‌ పీజీ ఫలితాలు nbe.edu.in, natboard.edu.inలలో చూడవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని