
Nepal: ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు
ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం
కాఠ్మాండూ: నేపాల్ ప్రధానమంత్రిగా ఆ దేశ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బాను నియమించాలని అక్కడి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ దిగువసభను తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్రపతి బిద్యా దేవి భండారీకి ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటును రద్దు చేస్తూ మే నెలలో రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఛోలేంద్ర శుంషర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేసింది. జులై 18 సాయంత్రం 5 గంటలకు కొత్త పార్లమెంట్‌ను సమావేశపర్చాలని సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.
నేపాల్ రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఐదు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ప్రభుత్వం రద్దయ్యింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ తాను తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని ఆపద్ధర్మ ప్రధాని ఓలీ సమర్థించుకున్నారు. న్యాయస్థానాలు ప్రధానిని నియమించలేవని.. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లోకి సుప్రీంకోర్టు తలదూర్చలేదని ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు. ప్రధాని ఓలీ సిఫారసు మేరకు నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ కేవలం 5 నెలల వ్యవధిలోనే రెండో సారి మే 22న ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
OTS: సచివాలయాల ఉద్యోగుల మెడపై ఓటీఎస్ కత్తి
-
Ts-top-news News
Weather Forecast: చురుగ్గా రుతుపవనాల కదలిక.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
-
Crime News
Crime News: షాకింగ్! ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు.. ఆపై విషాదం!
-
India News
Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
-
General News
Health: పాడైన చిగుళ్లను బాగు చేసుకోవచ్చు..ఎలానో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- గెలిచారు.. అతి కష్టంగా
- డీఏ బకాయిలు హుష్‌కాకి!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్