Published : 19 Dec 2021 22:02 IST

Omicron: ఒమిక్రాన్‌ కలవరం.. నెదర్లాండ్స్‌లో క్రిస్మస్‌ లాక్‌డౌన్‌!

ఆమ్‌స్టర్‌డామ్‌: భారీ సంఖ్యలో నమోదవుతున్న ఒమిక్రాన్‌ కేసులతో యూరప్‌ గజగజ వణికిపోతోంది. ఆస్ట్రియా, డెన్మార్క్‌ తదితర దేశాలు ఇప్పటికే కఠిన నిబంధనలను మళ్లీ ప్రవేశపెట్టాయి. ఇదే క్రమంలో నెదర్లాండ్స్‌ తాజాగా దేశంలో క్రిస్మస్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జనవరి 14 వరకూ అన్ని సాంస్కృతిక, వినోద కేంద్రాలు, కొన్ని దుకాణాలు మూసి ఉంటాయని ప్రధాని మార్క్‌ రుట్టే వెల్లడించారు. జనవరి 9 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. క్రిస్మస్ రోజు మినహా.. మిగతా రోజుల్లో అతిథుల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ‘ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. నెదర్లాండ్స్ ఆదివారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్తోంది’ అని రుట్టే చెప్పారు.

మరోవైపు బ్రిటన్‌లో వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉండటంతో.. స్థానికంగా రెండు వారాల లాక్‌డౌన్‌ విధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. లండన్‌లో అత్యవసర పరిస్థితి లాంటిది నెలకొందని మేయర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఫ్రాన్స్‌ తదితర దేశాలు యూకే నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి. జర్మనీ సైతం బ్రిటన్‌ను హై- రిస్క్‌ దేశాల జాబితాలో చేర్చింది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు ఆదివారం సాయంత్రం నుంచి కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు చూపాలని, రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని