CJI DY Chandrachud: 24 ఏళ్లలో ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోలేదు: సీజేఐ

న్యాయమూర్తిగా ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

Published : 28 Jun 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యాయమూర్తిగా తన 24 ఏళ్ల వృత్తిజీవితంలో ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి వివాదాలను పరిష్కరించేలా భారత్‌లోని న్యాయమూర్తులు శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించారు.

“24 ఏళ్లుగా న్యాయమూర్తిగా కొనసాగుతున్నాను. ఎప్పుడూ రాజకీయపర ఒత్తిళ్లను ఎదుర్కోలేదు. ప్రభుత్వ రాజకీయాలకు దూరంగా మా జీవితాలను గడపడం సహా.. భారత్‌లో ప్రజాస్వామిక సంప్రదాయాలు అనుసరిస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగపరమైన కేసుల విషయంలో రాజకీయాలపై తమ తీర్పుల ప్రభావం గురించి జడ్జీలు అవగాహన కలిగి ఉండాలి. అయితే.. దీన్ని రాజకీయ ఒత్తిడిగా పరిగణించను. అదేవిధంగా అనేక కేసులు తీవ్రమైన సామాజిక ప్రభావాలనూ కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాల ప్రభావం గురించి తెలుసుకోవడం అవసరం’’ అని చెప్పారు.

డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే..!

భారత్‌లో పెండింగ్‌ కేసుల సమస్య ఉందని అంగీకరిస్తూ.. దీని పరిష్కారానికి ఎక్కువ సంఖ్యలో న్యాయమూర్తులు అవసరమన్నారు. న్యాయవ్యవస్థను  బలోపేతం చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. న్యాయమూర్తులు, తీర్పులపై సోషల్‌ మీడియాలో వచ్చే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘కొన్నిసార్లు అవి న్యాయంగా ఉంటాయి. మరికొన్నిసార్లు అలా ఉండవు. ఏదేమైనా.. తాము చేసే పనిపై ప్రజల విమర్శలను అంగీకరించేంత విశాలమైన మనసు జడ్జీలకు ఉందని విశ్వసిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని