Attorney General: నూతన అటార్నీ జనరల్‌గా ఆర్‌.వెంకటరమణి

నూతన అటార్నీ జనరల్‌ (ఏజీ)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ ఆర్‌. వెంకటరమణిని....

Published : 28 Sep 2022 21:56 IST

దిల్లీ: నూతన అటార్నీ జనరల్‌ (ఏజీ)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ ఆర్‌. వెంకటరమణిని తదుపరి ఏజీగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం ఏజీగా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఏజీగా వెంకటరమణిని నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే, అంతకముందు ఈ పదవి చేపట్టాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని కేంద్రం కోరగా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని