కరోనా స్ట్రెయిన్‌: గంటలోనే ఫలితం

కరోనా వ్యాక్సిన్ తయారయ్యి అందుబాటులోకి వచ్చేసరికి వైరస్‌ రూపాంతరం చెందుతూ ప్రపంచాన్ని ఆందోళనలో ముంచేసింది. ముఖ్యంగా యూకేలో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ 50శాతం ఎక్కువగా వ్యాపించే లక్షణాలను కలిగి ఉంది.

Published : 05 Feb 2021 21:23 IST

కొత్త కరోనా టెస్టును తయారు చేసిన సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు

దిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారై అందుబాటులోకి వచ్చేసరికి వైరస్‌ రూపాంతరం చెందుతూ ప్రపంచాన్ని ఆందోళనలో ముంచేసింది. ముఖ్యంగా యూకేలో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ 50శాతం ఎక్కువగా వ్యాపించే లక్షణాలను కలిగి ఉంది. దీంతో దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి కొత్త స్ట్రెయినా.. కాదా అని నిర్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి ఫలితాలు రావడానికి కనీసం 36 నుంచి 48 గంటల సమయం పడుతోంది. దీంతో ఈ ఇబ్బందులను తొలగించేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్) కొత్త కరోనా టెస్టును రూపొందించింది. ఈ టెస్టు ద్వారా కేవలం ఒక గంటలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి ఫలితాన్నందిస్తుందని పరిశోధక బృందం తెలిపింది. ఆ టెస్టుకు రాపిడ్‌ వేరియంట్‌ యస్సే(రే) అని పేరు పెట్టారు. ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే కు గౌరవసూచకంగా ఆయన పేరును పెట్టినట్లు వారు తెలిపారు.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ఇప్పటికే జీనోమ్‌ కన్సార్టియంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విమానాశ్రయాల్లోనే వైరస్‌ జన్యు పరీక్షలు నిర్వహించేలా వీటిని రూపొందించారు. సీఎస్‌ఐఆర్‌ రూపొందించిన రే టెస్టును పేపర్‌ స్ట్రిప్‌ ద్వారా చేస్తారు. వీటిలో యూకే స్ట్రెయిన్‌ మాత్రమే కాకుండా కొత్తగా ఏవైనా స్ట్రెయిన్‌లు వచ్చినా గుర్తించొచ్చని పరిశోధకులు వెల్లడించారు.

ఇవీ చదవండి..

మార్చిలో వృద్ధులకు కరోనా టీకా

యాంటీ బాడీలను ఏమార్చేలా కరోనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు