అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు

వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కేంద్రప్రభుత్వం బుధవారం

Published : 18 Feb 2021 11:05 IST

దిల్లీ: వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కేంద్రప్రభుత్వం బుధవారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. వివిధ దేశాల్లో కరోనా కొత్త రకాలు పుట్టుకొస్తున్న తరుణంలో ఇవి జారీ అవడం గమనార్హం. కొత్త ప్రామాణిక నిర్వహణ విధానాలు ఈ నెల 22 అర్ధరాత్రి 11.59 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేవరకు అమల్లో ఉంటాయి. బ్రిటన్, ఐరోపా, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం వెలువరించింది. అదే సమయంలో ఈ నెల 28 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్రిటన్, ఐరోపా, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణం మొదలవడానికి ముందే ఎయిర్‌ సువిధ వెబ్‌సైట్‌లో స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్‌-19 ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం నివేదికను అప్‌లోడ్‌ చేయాలి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని