సచిన్‌ వాజే సెటిల్మెంట్‌..!

రూ.కోట్లాడి రూపాయిల బీఎంసీ ఈ టెండరింగ్‌ స్కామ్‌ సెటిల్మెంట్లో సచిన్‌వాజే తలదూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Published : 09 Apr 2021 15:37 IST

వెలుగులోకి మరో లేఖ

ఇంటర్నెట్‌డెస్క్‌: కోట్లాది రూపాయల బీఎంసీ ఈ టెండరింగ్‌ స్కామ్‌ సెటిల్మెంట్లో సచిన్‌వాజే తలదూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు తాజాగా ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖను జాన్‌ మిషెల్‌ డీకొస్టా అనే వ్యక్తి ముంబయి పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలే, బీఎంసీ కమిషనర్‌ ఇక్బాట్‌ చాహల్‌కు రాశారు. ఈ టెండరింగ్‌ స్కామ్‌ సెటిల్మెంట్‌పై దర్యాప్తు జరపాలని ఈ లేఖలో డిమాండ్‌ చేశారు.

రూ.500 కోట్ల విలువైన ఈ టెండరింగ్ కుంభకోణాన్ని సచిన్‌ వాజే దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఆయన సెటిల్మెంట్‌ చేశారని ఈ లేఖలో పేర్కొన్నారు. వాజేను అరెస్టు చేసిన ఆరు రోజుల తర్వాత ఈ లేఖ వచ్చింది. 

ఈ టెండరింగ్‌ కుంభకోణం ఏమిటీ..?

బీఎంసీ ఆన్‌లైన్‌ టెండర్ల వ్యవస్థను కొందరు కాంట్రాక్టర్ల ముఠా హ్యాక్‌ చేయించిందని ఫిబ్రవరిలో ఆరోపణలు వచ్చాయి. ముఠాలోని సభ్యులు అత్యల్ప మొత్తానికి దాఖలైన బిడ్లను కనుక్కొని వాటి కంటే తక్కువ మొత్తానికి బిడ్లు దాఖలు చేశారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన కాంట్రాక్టులు దక్కించుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని