
Airbags in Car: ఇక కారులో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి..!
కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలు
దిల్లీ: ప్రమాద సమయంలో కార్లలో ఎయిర్‌బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13వేల ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, ఇటువంటి ప్రమాదాలను నివారించడంతోపాటు వాహనదారుల భద్రత కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వాహనంలో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగులు (సైడ్ ఎయిర్‌బ్యాగులతో సహా) అమర్చేలా ప్రతిపాదనలు చేశామన్నారు. ఇప్పటికే వీటిని రవాణాశాఖ నోటిఫై చేసిందన్న ఆయన.. అక్టోబర్ 1 నుంచి నిబంధనలు అమలులోకి వస్తాయని అన్నారు.
‘ప్రతిఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వాటిలో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2020లో మొత్తం 25,289 ప్రమాదాలు చోటుచేసుకోగా.. వాటిలో 30శాతం మంది తలకు గాయాల కారణంగానే మరణించారు. ఒకవేళ ఎయిర్‌బ్యాగులు ఉన్నట్లయితే 8598 మంది ప్రాణాలు కాపాడుకునేవాళ్లం. అదేవిధంగా ఇరువైపుల తలుపులను ఢీకొట్టడం వల్ల 14వేల మంది చనిపోగా.. సైడ్ ఎయిర్‌బ్యాగులు ఉంటే 4424 మందిని రక్షించుకునేవాళ్లం. అందుకే మరిన్ని నిబంధనలు తీసుకొస్తున్నాం. ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి. సాధారణ మోడళ్లకు (Economy Model) కూడా దీన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించాం’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, ప్రజల ప్రాణాలకు కాపాడుకోవడంలో భాగంగా వాహన రంగంలో రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ తరహా విధానం వల్ల ఆటోమొబైల్ రంగంలో గుణాత్మక మార్పులు రావడంతోపాటు ఉపాధి అవకాశాలు, ఎగుమతుల్లో వృద్ధి వంటి మెరుగవుతుందన్నారు.
ఇదిలాఉంటే, కారు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఎప్పటినుంచో యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎకానమీ మోడళ్లతో సహా కొత్తగా వచ్చే అన్ని వాహనాలకు ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి అన్ని కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరి చేసిన కేంద్ర రవాణాశాఖ.. వెనుక కూర్చున్న వారికీ భద్రత కల్పించేలా మరో 4 ఎయిర్ బ్యాగ్‌లు కూడా (మొత్తం 6 అవుతాయి) తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. కొద్దిపాటి అదనపు వ్యయం వల్ల కారులో అందరు ప్రయాణికులకు భద్రత పెరుగుతుందని భావిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా