కొత్త పార్లమెంటు భవనానికి 10న శంకుస్థాపన

భారత నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోకసభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు సహా సుమారు 200 మంది అథిధులు హాజరు కానున్నారు.

Updated : 09 Dec 2020 04:28 IST

దిల్లీ: భారత నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోకసభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు సహా సుమారు 200 మంది అతిథులు హాజరు కానున్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో.. స్వతంత్ర భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం జరగబోతోంది. త్రిభుజాకారంలో.. అత్యాధునిక ఇంధన సామర్ధ్యంతో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా సౌకర్యాలు నూతన పార్లమెంటులో ఉంటాయి. లోక్‌సభ ప్రస్తుత పరిమాణానికి 3 రెట్లు, రాజ్యసభ గణనీయమైన స్థాయిలో విశాలంగా నిర్మాణం జరగబోతోంది. కొత్త భవనం లోపలి భాగంలో.. భారతీయ సంస్కృతి, ప్రాంతీయ కళలు, హస్తకళలు, వస్త్రాలు, వాస్తుశిల్పాల విభిన్న సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. పర్యావరణ అనుకూల పద్ధతులను నిర్మాణంలో వినియోగించనున్నారు’ అని ప్రధాని కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని