ట్రంప్‌పై ప్రేమతో రష్యా ..!
అమెరికాలో జరిగిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో కూడా రష్యా మరోసారి జోక్యం చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ యావ్రిల్ హెయిన్స్ ధ్రువీకరించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు లబ్ధిచేకూర్చి బైడెన్‌ను నష్టపర్చేలా ప్రయత్నాలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అమెరికా ఎన్నికల్లో మరోసారి జోక్యం
బాంబుపేల్చిన ఇంటెలిజెన్స్ విభాగం
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలో జరిగిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో కూడా రష్యా మరోసారి జోక్యం చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ యావ్రిల్ హెయిన్స్ ధ్రువీకరించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు లబ్ధిచేకూర్చి బైడెన్‌ను నష్టపర్చేలా ప్రయత్నాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ట్రంప్‌కు సన్నిహితులైన అధికారులను వినియోగించుకొని బైడెన్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమికి రష్యానే కారణమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాంటిది వరుసగా మరో సారి అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలిసో.. తెలియకో ట్రంప్ సన్నిహితులైన అధికారులు వీరికి ఉపయోగపడినట్లు గుర్తించింది.
ట్రంపే స్వయంగా అమెరికా ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేట్లు వ్యవహరించేట్లు చేశారని ఈ నివేదిక పేర్కొంది. ఆయన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ట్రంప్ ఆరోపించారని.. కొంత మంది రిపబ్లికన్ పార్టీ గవర్నర్లు ఆయనకు వంతపాడారని వెల్లడించింది. చివరికి ఇవి క్యాపిటల్ హిల్ దాడికి కారణం అయ్యాయని పేర్కొంది. ఇదే విధానంలో రష్యా 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోకపోవచ్చని తెలిపింది. ఇరాన్ కూడా అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రయత్నించిందని వెల్లడించింది. చైనా కూడా ప్రయత్నించినా ఆ స్థాయిలో విజయవంతం కాలేకపోయిందని వెల్లడించింది.
ఉక్రెయిన్ నేతలను వాడుకొని..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ చట్ట సభ సభ్యుడు ఆండ్రీ డెర్కెచ్‌ను ఉపయోగించుకొని ట్రంప్‌ను ప్రభావితం చేసినట్లు గుర్తించింది. అండ్రీ పక్కా రష్యా ఏజెంట్ అని ఆ నివేదికలో వెల్లడించారు. ట్రంప్ అటార్ని రూడీ గులియానీని అతను వాడుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేశారని పేర్కొన్నారు. బైడెన్ కుమారుడిపై మాస్కోకు అత్యంత సన్నిహితమైన వారే తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారని వెల్లడించింది. ఈ ఇంటెలిజెన్స్ నివేదికలో గులియానీ పేరును నేరుగా వాడలేదు. ట్రంపు చుట్టుపక్కల వ్యక్తులు ఏవి పడితే అవి నమ్మే వారు కావడంతో.. రష్యా దానిని వాడుకొని కూడా ఉండొచ్చని నివేదిక వెల్లడించింది.
2020 మొదటి నుంచి బైడెన్, ఆయన కుటుంబీకులు ఉక్రెయిన్‌తో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్లు రష్యా ప్రచారం మొదలుపెట్టింది. వాస్తవానికి బైడెన్‌గానీ, ఆయన కుమారుడిపై గానీ వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని తాజా నివేదిక వెల్లడించింది. కానీ, ట్రంప్ ప్రచారంలో అదే కేంద్రబిందువుగా మారిందని పేర్కొంది. అమెరికా ఎన్నికల వ్యవస్థలోకి విదేశీ శక్తులు ఎంతలా చొచ్చుకు రావచ్చో ప్రచారం సందర్భంగా ట్రంప్ వాడిన సమాచారం తెలియజేస్తోందని వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం