ఈ బొమ్మ ఎవరిదో కనిపెడతారా?: కివీస్‌ ప్రధాని

ప్రజల కష్టాలను తీర్చడం దేశాన్ని పరిపాలిస్తున్న నేతల కర్తవ్యం. కానీ, న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్‌ ప్రజలవే కాదు.. ఓ బొమ్మ కష్టాన్ని కూడా తీర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. బొమ్మకొచ్చిన కష్టమేంటని అనుకుంటున్నారా? అదేం లేదండి.. ఓ కుందేలు

Updated : 09 Apr 2022 10:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజల కష్టాలను తీర్చడం దేశాన్ని పరిపాలిస్తున్న నేతల కర్తవ్యం. కానీ, న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్‌ ప్రజలవే కాదు.. ఓ బొమ్మ కష్టాన్ని కూడా తీర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. బొమ్మకొచ్చిన కష్టమేంటని అనుకుంటున్నారా? అదేం లేదండి.. ఓ కుందేలు బొమ్మను ఎవరో ఎయిర్‌పోర్టులో మరిచిపోయి వెళ్తే దాన్ని యజమాని చెంతకు చేర్చడానికి సాయం చేయండంటూ జెసిండా నెటిజన్లను కోరుతున్నారు.

ప్రధాని జెసిండా తాజాగా హామిల్టన్‌ ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడే బోర్డు రూమ్‌లో పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తుండగా.. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెకు కుందేలు(బన్నీ) బొమ్మను చూపించారు. దాన్ని జనవరి 28న ఎవరో ఎయిర్‌పోర్టులోనే మరిచిపోయి వెళ్లారట. దానికి సిబ్బంది ‘వింక్‌’ అని పేరుపెట్టి, ప్రత్యేకంగా జాకెట్‌, ఐడీ కార్డు తయారు చేసి దానికి తొడిగారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. బొమ్మకు మాస్క్‌ వేయడం గమనార్హం. దీన్ని ఎలాగైనా యజమాని వద్దకు చేర్చాలని ప్రధానిని సిబ్బంది కోరారు. దీంతో జెసిండా ఆ బొమ్మతో సెల్ఫీ దిగి తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాల్లో పోస్టు చేశారు. బొమ్మ గురించి వివరిస్తూ.. ‘ఎవరి జీవితంలోనైనా చిన్న పిల్లలు ఉండి ఉంటే ఈ బొమ్మ విలువెంటో కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి దీని యజమానిని కనిపెట్టడంలో సాయం చేయండి’’అని పేర్కొన్నారు. జెసిండా మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె చేసిన పోస్టుకు గంటల వ్యవధిలోనే వేలకొద్ది లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని