రెండు వారాల కవలల్లో కరోనా వైరస్‌

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కోరలు చాచినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు వచ్చినా.. వైరస్‌ మళ్లీ తిరగబడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ వైరస్‌ సోకుతోంది. ఈ మేరకు గుజరాత్‌లోని వడోదరలో ఈ మధ్యనే జన్మించిన కవలలకు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు...

Published : 03 Apr 2021 01:25 IST

వడోదర: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కోరలు చాచుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందిరిలోనూ ఈ మహమ్మారి వెలుగుచూస్తోంది. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో ఈ మధ్యనే జన్మించిన కవలలకు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. జన్మించిన అనంతరం డిశ్చార్జి చేసి ఇంటికి పంపించగా.. 15 రోజుల తర్వాత వారిలో డీహైడ్రేషన్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో చిన్నారులను ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని