Published : 01/10/2021 22:20 IST

Corona: మరో 6-8 వారాలు చాలా ముఖ్యం: ఎయిమ్స్‌ చీఫ్‌

దిల్లీ: కరోనా వైరస్‌ సంక్రమణ రేటు తగ్గుముఖం పట్టాలంటే మరో 6-8 వారాలు ఎంతో ముఖ్యమని దిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. రానున్న పండగల నేపథ్యంలో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా జాగ్రత్తలు వహిస్తే కొవిడ్‌ కేసుల మొత్తం సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చని, వ్యాధి సంక్రమణ రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రానున్న దసరా, దీపావళి తదితర పండగల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గులేరియా సూచించారు.

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా ‘కొవాగ్జిన్‌’కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరుచేసే విషయమై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపగా దానిపై గులేరియా స్పందించారు. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి లభించాలని ఆకాంక్షించారు. మొత్తం సమాచారం సమర్పించామని, వాటిపై అధ్యయనాలు కూడా పూర్తయినట్లు తెలిపారు. ప్రయాణాలను ప్రోత్సహించేందుకు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారిని విదేశాలు అనుమతివ్వాలని ఈ సందర్భంగా కోరారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని