NGT: కర్ణాటక ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

పర్యావరణానికి హానికలిగించే ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు గానూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) కర్ణాటక ప్రభుత్వానికి రూ.2,900కోట్ల భారీ జరిమానా విధించింది.

Published : 15 Oct 2022 23:04 IST

బెంగళూరు: పర్యావరణానికి హానికలిగించే ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు గానూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) కర్ణాటక ప్రభుత్వానికి రూ.2,900కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా ప్రత్యేక ఖాతాలో డిపాజిట్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అంతేకాకుండా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై గత ఎనిమిదేళల్లో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేపనిగా పర్యావరణానికి నష్టం కలిగించే వ్యవహరిస్తే ఎన్జీటీ చట్టంలోని సెక్షన్‌ 15 ప్రకారం జరిమానా తప్పదని ధర్మాసనం స్పష్టం చేసింది. జరిమానా చెల్లించడంతో పాటు వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణను నెలలోగా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని