NGT: బెంగాల్ ప్రభుత్వానికి రూ.3500కోట్ల జరిమానా..!
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ NGT) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు
దిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ NGT) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు గానూ రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు రూ.12,819కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. మురుగు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు బెంగాల్ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ట్రైబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది.
‘‘దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఆరోగ్య సంబంధిత సమస్యలను వాయిదా వేయలేం. ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల కొరత కోసం ఎదురుచూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలను ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్ ప్రభుత్వం జమ చేయాలి’’ అని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇకనైనా చెత్త నిర్వహణపై బెంగాల్ సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs PAK: 2015 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ అలా అన్నాడు: సోహైల్
-
World News
Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. లాటిన్ అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్