NHAI: టోల్‌ ఆదాయం ఇప్పుడు ₹40వేల కోట్లు.. మరో మూడేళ్లలో..?: గడ్కరీ

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి వచ్చే మూడేళ్లలో టోల్‌ ఆదాయం భారీగా పెరగనుందని కేంద్ర రహదారుల శాఖ .....

Updated : 21 Dec 2021 18:01 IST

దిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి వచ్చే మూడేళ్లలో టోల్‌ ఆదాయం భారీగా పెరగనుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 40వేల కోట్ల మేర టోల్‌ రూపంలో ఆదాయం వస్తుందని.. మూడేళ్ల తర్వాత అది ₹1.40లక్షల కోట్లుగా ఉండనుందన్నారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏటా ట్రాఫిక్ సాంద్రత పెరుగుతున్నందున భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడిదారులకు భారీ అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐకి టోల్‌ ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి ₹40వేల కోట్లుగా ఉందని, ఇది వచ్చే మూడేళ్లలో 1.40లక్షలకు పెరుగుతుందని పునరుద్ఘాటించారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ఆహ్వానించిన గడ్కరీ.. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతోందన్నారు. అందువల్ల సహజంగానే, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అంతర్గతంగా రాబడి రేటు కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని