Rajasthan: ఐసీయూలో శిశువుల మరణాలపై నివేదిక ఇవ్వండి : జాతీయ మానవ హక్కుల కమిషన్‌

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగం(ఐసీయు)లో చికిత్స పొందుతున్న శిశువులు వార్మర్ల వేడి ఎక్కువైన కారణంగా చనిపోయారు.

Published : 23 Apr 2022 13:37 IST

దిల్లీ: రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగం(ఐసీయు)లో చికిత్స పొందుతున్న ఇద్దరు శిశువులు వార్మర్ల వేడి ఎక్కువైన కారణంగా చనిపోయారు. ఈ  ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో ఘటనపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు ఎంత వరకు వచ్చింది.. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం చేశారు? తదితర వివరాలను ఆ నివేదికలో పొందుపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన్నట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తెలిపింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వచ్చాయని సిబ్బంది అది గమనించకపోవడంతో మరణాలు సంభవించాయని ఆ వార్తల్లో పేర్కొన్నారు. ఆ సమయంలో ఐసీయులో 20మంది శిశువులు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని