Engineer Rashid: జైల్లో ఉన్న ఇంజినీర్‌ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్‌ఐఏ అనుమతి

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ జైల్లో ఉండటంతో ఇంజినీర్‌ రషీద్ (Engineer Rashid ).. ఎంపీగా ప్రమాణం చేయలేకపోయారు. దీనిపై ఎన్‌ఐఏ స్పందించింది. 

Updated : 01 Jul 2024 18:22 IST

దిల్లీ: ఉగ్రనిధుల కేసు (terror-funding case) నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ (Engineer Rashid) ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమ్మతి తెలియజేసింది. దీనిపై దిల్లీ హైకోర్టు తుది ఆదేశాలు వెలువరించాల్సి ఉంది.

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు చెందిన షేక్ అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఇంజినీర్ రషీద్‌ బారాముల్లా నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి, విజయం సాధించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో అరెస్టయ్యారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉండటంతో మిగతావారితో పాటు 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయలేపోయారు.

Lok Sabha Election Results: జైలు నుంచే ఎంపీగా గెలుపు.. లోక్‌సభకు వెళ్లొచ్చా..?

తన ప్రమాణస్వీకారం కోసం మధ్యంతర బెయిల్‌ కోరుతూ రషీద్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మనీలాండరింగ్ కేసులో తిహాడ్‌ జైల్లో ఉన్న సమయంలో పార్లమెంట్‌కు వచ్చి, ఆప్‌ నేత సంజయ్‌సింగ్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించాలని, జులై ఒకటిలోగా సమాధానం ఇవ్వాలని ఎన్‌ఐఏను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ తన సమ్మతిని తెలియజేసింది. దీనిపై రేపు కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఇదిలాఉంటే.. పంజాబ్‌ (Punjab)లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. అతడు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అతడు కూడా జైల్లోనే ఉన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని