NIA: ఐసిస్‌తో లింకులు.. ఆరు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ ఏకకాలంలో సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక,

Published : 01 Aug 2022 02:03 IST

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్​, బిహార్​, మధ్యప్రదేశ్‌లో ఐసిస్ (ISIS) ​ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్​, కొల్హాపుర్.. గుజరాత్‌లోని భరుచ్​, సూరత్​, నవ్​సారి, అహ్మదాబాద్‌లో సోదాలు చేసింది. కర్ణాటకలోని భత్కల్​, తుమ్​కుర్.. బిహార్‌లోని ఆరియా.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్​.. యూపీలోని దియోబంద్‌ జిల్లాలో ఈ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో కీలక పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐసిస్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఓ కేసును సుమోటోగా తీసుకున్న ఎన్ఐఏ జూన్​25న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ఈ సోదాలు నిర్వహించింది.

ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన ఓ వ్యక్తిని ఈ దాడుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం దాడులు చేపట్టి.. 30ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని గుజరాత్​యాంటీ టెర్రరిజం స్క్వాడ్​తెలిపింది. తీవ్రవాద సంస్థ పాపులర్​ఫ్రంట్​ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)తో సంబంధం ఉందన్న ఆరోపణలతో బిహార్‌లోని నలంద జిల్లాలో గురువారమే సోదాలు నిర్వహించింది.

కేరళలోనూ దాడులు నిర్వహించింది. పోలీసులపై హత్యాయత్నం చేసిన సతిక్​బచ్చాకు సంబంధించిన కేసులో ఈ దాడులు చేపట్టింది. తిరువనంతపురంలో నిర్వహించిన  సోదాల్లో ఎలక్ట్రానిక్​వస్తువులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బిహార్‌లోనూ పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న ముగ్గురి ఇళ్లలో అధికారులు దాడులు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని