NIA: గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఏ నిఘా.. ఏకకాలంలో 100కి పైగా ప్రాంతాల్లో సోదాలు

NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బుధవారం ముమ్మర సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 6 రాష్ట్రాల్లోని 100కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు.

Published : 17 May 2023 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్‌, గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. బుధవారం ఏకకాలంలో 6 రాష్ట్రాల్లోని 100కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో నేటి తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు (Raids) జరుగుతున్నట్లు ఎన్‌ఐఏ (NIA) వర్గాలు వెల్లడించాయి. 

గతేడాది నమోదైన మూడు వేర్వేరు కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ వేర్పాటు వాద సంస్థ నాయకుల అనుచరులు, గ్యాంగ్‌స్టర్‌ ముఠా సభ్యుల మద్దతుదారుల ఇళ్లల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఖలిస్థానీ మద్దతుదారులు దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. విదేశాల్లో దాక్కున్న కొందరు గ్యాంగ్‌స్టర్లు ఖలిస్థానీ వేర్పాటువాదుల సహకారంతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఎన్‌ఐఏ ఈ సోదాలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని