Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్‌..!

ముంబయిలో ఉగ్రదాడులకు పాల్పడతామంటూ ఎన్‌ఐఏకు ఓ మెయిల్‌ రావడం కలకలం రేపుతోంది.  దీంతో మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. దర్యాప్తు చేపట్టారు. 

Published : 03 Feb 2023 13:50 IST

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు వచ్చిన ఓ మెయిల్‌ కలకలం రేపుతోంది. ముంబయిలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ చేశాడు. తాను తాలిబాన్‌ సభ్యుడినంటూ దానిలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ బెదిరింపు సమాచారాన్ని ముంబయి పోలీసులకు అందించిన ఎన్‌ఐఏ.. దీనిపై సంయుక్త దర్యాప్తు ప్రారంభించింది. అదే సమయంలో అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రంలోని అన్ని నగరాలను అప్రమత్తం చేశారు.

ముంబయిలో పేలుళ్లకు పాల్పడతామంటూ ఇటీవల చాలా బెదిరింపు కాల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. నగరంలో చాలాచోట్ల బాంబులు పెట్టామంటూ గతేడాది అక్టోబర్‌లో పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తర్వాత అది ఫేక్‌ కాల్‌ అని తేలింది. ఈ ఏడాది జనవరిలోనూ ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్‌ వచ్చింది. స్కూల్‌లో టైంబాంబు పెట్టామంటూ ఫోన్‌ రావడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, ఫేమస్‌ కావడం కోసమే తాను ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని