Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్‌ఐఏ చేతికి..

రాజస్థాన్‌లో ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పదిరోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన కెమిస్ట్ హత్య వెలుగులోకి వచ్చింది.

Published : 03 Jul 2022 01:55 IST

జైపూర్‌: రాజస్థాన్‌లో ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పదిరోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన కెమిస్ట్ హత్య వెలుగులోకి వచ్చింది. గొంతుకోసి హతమార్చినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు శనివారం  కేంద్రమంత్రి అమిత్‌ షా ఆదేశాలు ఇచ్చారు. ఈ హత్యవెనుక కుట్ర కోణం, అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు జరపనున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ హత్యకు నుపుర్ వివాదానికి సంబంధం ఉందని పోలీసులు చెప్పినట్లు తాజాగా తెలుస్తోంది.  

కెమిస్ట్ హత్య కేసుకు.. ఉదయ్‌పుర్ ఘటనకు సంబంధం ఉందని స్థానిక భాజపా నేతలు ఆరోపించారు. నుపుర్ శర్మ వివాదమే ఈ హత్యకు కారణమని, నుపుర్‌ శర్మకు మద్దతు ఇవ్వడం వల్లే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని తెలిసిందన్నారు. కానీ పోలీసులు ఈ విషయాన్ని వెలుగులోకి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. జూన్‌ 21న జరిగిన కెమిస్ట్ హత్య గురించి పోలీసులు బయటపెట్టి ఉంటే.. కన్హయ్య హత్య జరిగి ఉండేది కాదన్నారు.

అమరావతికి చెందిన ఉమేశ్‌ కొల్హే(మృతుడు) జూన్ 21న తన షాప్‌ నుంచి వస్తుండగా.. కొందరు దుండగులు అడ్డగించి, గొంతుకోసి చంపివేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత గొడవలు, దొంగతనం ఈ హత్యకు కారణం కావొచ్చని మొదట భావించగా.. ఆ తరహాలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఉమేశ్‌ కూడా దర్జీ మాదిరిగానే సామాజిక మాధ్యమాల్లో నుపుర్‌ శర్మకు మద్దతు పలికారని భాజపా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని