కొవాక్స్‌ నుంచి నైజీరియాకు 4మిలియన్ల టీకాలు!

పేద, మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్లు అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా నైజీరియాకు 4 మిలియన్ల వ్యాక్సిన్లను అందించారు.

Published : 02 Mar 2021 21:56 IST

కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా 4 మిలియన్ల టీకాలు

అబుజా: పేద, మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్లు అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా నైజీరియాకు 4 మిలియన్ల వ్యాక్సిన్లను అందించారు. ఈ మేరకు యూనిసెఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కొవాక్స్‌ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు గవి, యూనిసెఫ్‌ కలిసి పనిచేస్తున్నాయి. కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం ముంబయి నుంచి అబుజాకు వ్యాక్సిన్లను పంపింది. ‘‘కరోనా కారణంగా నైజీరియా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అక్కడ సుమారు రెండు లక్షల మందికి వైరస్‌ సోకింది. రెండు వేల మంది మరణించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడే సమయం వచ్చింది’’ అని యూనిసెఫ్‌ నైజీరియా ప్రతినిధి పేర్కొన్నారు. త్వరలో మరిన్ని వ్యాక్సిన్లను అందుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా 90 మిలియన్ల వ్యాక్సిన్లను నైజీరియాకు అందించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించుకుంది. అందులో 90 దేశాలు తాము వ్యాక్సిన్లను కొంటామని తెలపగా మిగిలిన 90పైగా దేశాలకు ఉచితంగా అందించనున్నారు. రవాణాలో ఇబ్బందుల కారణంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ఆలస్యమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొవాక్స్‌ కార్యక్రమంలో వ్యాక్సిన్లను పొందిన ఘనా మంగళవారం నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. 5లక్షల వ్యాక్సిన్లను పొందిన ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్‌ సోమవారం నుంచి వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు