Punjab: పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ, స్కూళ్ల మూసివేత.. ఎన్నికల ర్యాలీలపై మాత్రం ఆంక్షల్లేవ్..!
ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల ఛట్రంలోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా
చండీగఢ్: ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల ఛట్రంలోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంతో పాటు రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేడు సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త ఆంక్షలపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రత్యక్ష తరగతులు మూసివేయాలని ఆదేశించారు. ఆన్లైన్ క్లాసులు మాత్రం కొనసాగించొచ్చని స్పష్టం చేశారు. అయితే మెడికల్, నర్సింగ్ కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
కొత్త ఆదేశాల ప్రకారం.. ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. బార్లు, సినిమా థియేటర్లు, మల్టిపెక్స్‌లు, షాపింగ్ మాల్స్, రెస్టారంట్లు, స్పా సెంటర్లు, మ్యూజియంలు, జూ వంటి ప్రదేశాలను 50% సామర్థ్యంతో నిర్వహించాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు పూర్తిగా మూసివేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆఫీసుల్లో రెండు డోసులు తీసుకున్న సిబ్బందిని మాత్రమే విధులకు అనమతించాలని ఆదేశించారు. ఈ ఆంక్షలు జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ర్యాలీలపై ఆంక్షల్లేవ్...
పంజాబ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రచారం హోరెత్తుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో కరోనా ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజకీయ సమావేశాలు, సభలపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం గమనార్హం. పంజాబ్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం క్రితం రోజువారీ కేసులు 50 దిగువనే ఉండగా.. నిన్న ఆ సంఖ్య 419కి చేరడం గమనార్హం. అటు పాజిటివిటీ రేటు కూడా విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న ప్రచార ర్యాలీలు కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశముందని ఓవైపు నిపుణులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. కొవిడ్ నిబంధనలను గాలికొదిలి భారీ ప్రజా సమూహాలతో ర్యాలీలు చేపడితే దేశంలో మూడో దశ ముప్పు తప్పదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఇందుకు సుముఖంగా లేవు. దీంతో సకాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల ఈసీ కూడా స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట