
ఆ నాలుగు సిటీల్లో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు!
అహ్మదాబాద్: కరోనా వైరస్ కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూని ఫిబ్రవరి 28 వరకు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్లలో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కొనసాగనుందని తెలిపారు. గతంలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఉన్న ఈ సమయాన్ని ఒక గంటపాటు తగ్గించారు. ఈ నెల 16 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పంకజ్ కుమార్ తెలిపారు. నవంబర్లో దీపావళి తర్వాత కేసులు పెరగడంతో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూని విధించింది.
మరోవైపు, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 7.91లక్షల మంది తొలి డోసు వేయించుకున్నట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. గుజరాత్లో ఆదివారం కొత్తగా 247 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,65,244కి పెరిగింది. వీరిలో 2,59,104మంది కోలుకోగా.. 4401 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1739 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.