Nirav Modi: నీరవ్‌ మోదీకి మరో షాక్‌.. రూ. 250కోట్ల ఆస్తులు సీజ్‌!

బ్యాంకుల రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సంబంధించిన ₹253.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది.......

Published : 23 Jul 2022 01:45 IST

దిల్లీ: బ్యాంకుల రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి (Nirav Modi) సంబంధించిన కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement Directorate) పురోగతి సాధించారు. నీరవ్‌కు సంబంధించిన ₹253.62 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది. అటాచ్‌ చేసినవాటిలో రత్నాలు, ఆభరణాలతోపాటు బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ఈడీ శుక్రవారం తెలిపింది. సీజ్‌ చేసిన ఈ ఆస్తులన్నీ హాంకాంగ్‌లో ఉన్నాయని ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

హాంకాంగ్‌లోని నీరవ్ మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రత్నాలు, ఆభరణాలు అక్కడి ప్రైవేటు లాకర్లలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతోపాటు ఆ దేశంలో నిర్వహిస్తున్న ఖాతాల్లోని బ్యాంక్ బ్యాలెన్స్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా అటాచ్ చేసింది. హాంకాంగ్‌లో నీరవ్‌ కంపెనీల్లోని పలు ఆస్తులను గతంలోనూ ఈడీ సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

పీఎన్‌బీ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో నీరవ్‌ మోదీ ఒకరు. నకిలీ ఎల్‌వోయూలతో బ్యాంకును మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి పరబ్‌ సైతం కనిపించకుండా పోయాడు. నీరవ్‌ ప్రస్తుతం లండన్‌లో జైలు జీవితం గడుపుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని