Parakala Vangamayi: నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ - పరకాల ప్రభాకర్ కుమార్తె వివాహం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె వాజ్ఞ్మయి (Parakala Vangamayi) వివాహం నిరాడంబరంగా జరిగింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహ క్రతువు పూర్తి చేశారు.
దిల్లీ: రాజకీయ ప్రముఖుల ఇళ్లలో పెళ్లంటే మామూలుగా ఉండదు. భారీ సెట్టింగులు, కళ్లు మిరుమిట్లుగొలిపే బాణసంచాలు.. రకరకాల వంటకాలతో ధూం ధామ్ అనిపిస్తుంటారు. రాజకీయ ప్రముఖులు, అధికారుల రాకతో ఎటు చూసినా సందడి వాతావరణమే. కానీ, అందుకు భిన్నంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) దంపతులు తమ కుమార్తె వాజ్ఞ్మయి (Parakala Vangamayi) వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించి ప్రత్యేకంగా నిలిచారు.
పరకాల వాజ్ఞ్మయి వివాహం ప్రతీక్‌తో గురువారం నిరాడంబరంగా జరిగింది. కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుక జరిపించారు. రాజకీయ ప్రముఖులెవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పురోహితులు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువు నిర్వహించారు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించకున్నా.. వివాహ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nijjar killing: నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్ఐ..!
-
S Jaishankar: అసాధారణ స్థితిలో భారత్- చైనా బంధం: జై శంకర్
-
Assam: మైనర్ బాలికకు నరకం.. ఆర్మీ అధికారి దంపతుల దాష్టీకం
-
TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు సబబే: హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
-
Nayanthara: మలేసియా వీధుల్లో నయన్ కుటుంబం సందడి..
-
PM Modi: ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్.. అదే మా లక్ష్యం: ప్రధాని మోదీ