కరోనావేళ..‘నిత్యానంద’ కైలాసానికి నో ఎంట్రీ!

కరోనా వేళ.. వివాదాస్పద మతగురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన ఆశ్చర్యపరుస్తోంది.

Published : 23 Apr 2021 01:15 IST

దిల్లీ: కరోనా వేళ.. వివాదాస్పద మతగురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన ఆశ్చర్యపరుస్తోంది. తన ఆధీనంలోని ‘కైలాస’ ద్వీపానికి భారతీయులకు అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలివ్వడమే అందుకు కారణం. భారత్‌, బ్రెజిల్, ఐరోపా సంఘం, మలేసియా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు తన ప్రెసిడెన్షియల్ మ్యాండేట్‌లో ప్రకటించారు. పలు దేశాల్లో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో.. తన దేశాన్ని రక్షించుకునేందుకు ట్విటర్ వేదికగా ఈ ప్రకటన చేశారు. 

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ..2019లో భారత్‌ను వదిలిపారిపోయారు. అప్పటినుంచి ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈక్వెడార్ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. కాగా, నిత్యానంద తాను ఉంటున్న ద్వీపాన్ని ‘కైలాస’ అని చెప్తుండటంతో పాటు, దానికి అధినేతగానూ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని