Nitin Gadkari : హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులో ప్రయాణించిన నితిన్‌ గడ్కరీ

ప్రేగ్‌లో నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న భారత రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

Updated : 03 Oct 2023 15:21 IST

ప్రేగ్‌: అత్యంత అధునాతన సాంకేతికతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులో భారత రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ప్రయాణించారు. చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఆయన సోమవారం హైడ్రోజన్‌ ఫ్యూయల్ (Hydrogen Bus) బస్సులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఆయన సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘‘కర్బన ఉద్గారాల విడుదల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ.. స్వచ్ఛమైన పచ్చటి భవితను అందించేందుకు ఈ బస్సులు దోహదపడుతున్నాయి’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. 

ఈ బస్సులు హైడ్రోజన్‌ వాయువును వాడుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొంటాయి. అక్టోబరు 1న ప్రేగ్‌లో ఏర్పాటు చేసిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రహదారి భద్రత లక్ష్యాలను సాధించడం కోసం భారతదేశం నిరంతరాయంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా గడ్కరీ వెల్లడించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని