Prashant kishor: రాష్ట్రం కోసం నీతీశ్‌ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్‌ కిషోర్‌

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 15 Jun 2024 13:53 IST

పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor) బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar)పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నేను ఎందుకు విమర్శిస్తున్నానని ప్రజలు నన్ను అడుగుతున్నారు. అప్పుడు సీఎం వేరే వ్యక్తి. కాని ఇప్పుడు మనస్సాక్షిని భాజపాకు అమ్మకానికి పెట్టారు. ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండేవాడు అక్కడి ప్రజలు గర్వపడేలా నడుచుకోవాలి. కానీ నీతీశ్‌ కుమార్  బిహార్‌కు అవమానాన్ని మిగిల్చారు’’ అని కిశోర్ ఆరోపించారు. మోదీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన నీతీశ్‌ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పలుకుబడిని ఉపయోగించట్లేదని మండిపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా(BJP) మెజారిటీ మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కౌంటింగ్‌కు ముందు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. అయితే, ఆ పార్టీకి మెజారిటీ మార్కు కంటే సీట్లు తగ్గాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని నిరూపిస్తూ ఇండియా కూటమి 234 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు మెజార్టీ రావడంతో ప్రధాని మోదీ తిరిగి బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని