
Caste Census: బద్ధ శత్రువులు పక్కపక్కనే.. కులగణనపై మోదీని కలిసిన నితీశ్ బృందం
ప్రధాని మా డిమాండ్‌ను తిరస్కరించలేదు: నితీశ్
పట్నా: కులాలవారీగా జనగణనను చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ సోమవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తమ అభ్యర్థనలను ప్రధాని విన్నారని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడించారు. ‘కులాలవారీగా జనగణనపై మా డిమాండ్‌ను ప్రధాని మోదీ విన్నారు. ఆయన దాన్ని తిరస్కరించలేదు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని మా బృందం కోరింది. మా విన్నపాన్ని పరిశీలిస్తారని మేం భావిస్తున్నాం’ అని నితీశ్ వెల్లడించారు.
ఈ రోజు ప్రధానిని కలిసిన బృందంలో నితీశ్ కుమార్‌తో సహా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. అలాగే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం బద్ధ శత్రువులైన నితీశ్, తేజస్వి పక్కపక్కనే నిల్చొని, మీడియాతో మాట్లాడుతూ కనిపించారు. బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి మీడియాతో మాట్లడుతూ.. బిహార్‌లో మాత్రమే కాకుండా దేశం మొత్తం కులగణన నిర్వహించాలని కోరామన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం గురించి వేచిచూస్తున్నట్లు చెప్పారు. దేశానికి, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాల విషయంలో తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.