SpiceJet: విమానంలో మొరాయించిన ఏసీ.. ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు

SpiceJet: అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమానంలో ఏసీ మొరాయించిన విషయం మరువక ముందే.. అచ్చం అలాంటి సంఘటనే స్పైస్‌జెట్‌ విమానంలో చోటు చేసుకుంది.

Updated : 19 Jun 2024 23:40 IST

SpiceJet | ఇంటర్నెట్‌డెస్క్‌: అధిక ఉష్ణోగ్రతల కారణంగా విమానంలో ఏసీలు మొరాయించిన ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇండిగో విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడిన విషయం మరువక ముందే అదే తరహా ఘటన మరొకటి చోటు చేసుకుంది. స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానంలో ఎయిర్‌ కండీషనింగ్‌ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గాలి అందక తీవ్ర అవస్థలు పడ్డారు.

స్పైస్‌జెట్‌ విమానం SG 476 దిల్లీ నుంచి బిహార్‌లోని దర్బంగాకు ఉదయం 11 గంటలకు బయల్దేరింది. తిరిగి దిల్లీకి వచ్చే సమయంలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ఏసీ పనిచేయలేదు. దీంతో గంటసేపు విమానంలోని వేడి తట్టుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊపిరాడక బ్రోచర్‌లు, మ్యగజైన్‌లు, రుమాళ్లతో విసురుకున్నారు. చాలా మంది ఒంటి నిండా చెమటలతో నిండిపోయిన ఫొటోలు, విమాన సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్‌ వైరల్‌గా మారాయి. 

దిల్లీ నీటి సంక్షోభానికి కేజ్రీవాలే కారణం: హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని