విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన చికిత్స పొందుతున్న దిల్లీలోని ఆర్మీ ఆస్పతి వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో

Updated : 18 Aug 2020 12:36 IST

దిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన చికిత్స పొందుతున్న దిల్లీలోని ఆర్మీ ఆస్పతి వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని తాజా బులెటిన్‌లో వెల్లడించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈనెల 10వ తేదీన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని