రైళ్ల పునరుద్ధరణపై రైల్వేశాఖ క్లారిటీ

ప్రయాణికుల రైళ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. ఫలానా తేదీ నుంచి రైళ్లను ప్రారంభిస్తారంటూమీడియాలో వస్తున్న కథనాలప.....

Updated : 14 Feb 2021 04:40 IST

దిల్లీ: ప్రయాణికుల రైళ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. ఫలానా తేదీ నుంచి రైళ్లను ప్రారంభిస్తారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. అలాంటి తేదీ అని తాము నిర్ణయించలేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్‌ నెలలో ఫలానా తేదీ నుంచి అన్ని ప్రయాణికుల రైళ్లను ప్రారంభిస్తారంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. అలాంటి తేదీ ఏదీ తాము నిర్ణయించలేదని తెలిపింది. ఇప్పటికే 65 శాతం రైళ్లు అందుబాటులో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దశలవారీగా రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామని, అదే తరహాలో భవిష్యత్‌లో సైతం మిగిలిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. కొవిడ్‌ నేపథ్యంలో రైళ్లన్నీ పూర్తిగా నిలిచిపోగా.. ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
ట్రాక్టర్‌ నడుపుతూ సభా వేదికకు రాహుల్‌
17 రాష్ట్రాల్లో ‘0’, 13 రాష్ట్రాల్లో 5లోపే మరణాలు 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని