NRC: ఎన్‌ఆర్‌సీపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు: కేంద్రం

దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ని సిద్ధం చేసే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ....

Published : 15 Mar 2022 23:15 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ని సిద్ధం చేసే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసోంలో ఎన్‌ఆర్‌సీకి సంబంధించిన అనుబంధ జాబితా, మినహాయింపు జాబితాను 2019 ఆగస్టు 31న ప్రచురించినట్టు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టికను సిద్ధం చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు నిత్యానంద్‌ రాయ్‌ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

2019లో కేంద్రం అసోంలో ఎన్‌ఆర్‌సీని అప్‌డేట్‌ చేసి తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 3.30 కోట్ల మంది దరఖాస్తుదారుల్లో 3.11 కోట్ల మందిని చట్టబద్ధంగా నివసించే స్థానికులుగా గుర్తించిన కేంద్ర హోంశాఖ.. ఈ జాబితాలో 19.06లక్షల మందికి పైగా ప్రజల్ని చేర్చకపోవడం అప్పట్లో పెద్ద రాజకీయ దుమారానికి కారణమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని