‘లతా మంగేష్కర్‌, సచిన్‌లపై విచారణ జరపబోం’

లతా మంగేష్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌ చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని తాను అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. ప్రముఖుల ట్వీట్ల విషయంలో భాజపా ఐటీ సెల్‌ పాత్రను పరిశీలిస్తామని మాత్రమే....

Published : 16 Feb 2021 13:23 IST

తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న హోంమంత్రి

ముంబయి: లతా మంగేష్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌ చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని తాను అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. ప్రముఖుల ట్వీట్ల విషయంలో భాజపా ఐటీ సెల్‌ పాత్రను పరిశీలిస్తామని మాత్రమే అన్నట్లు ఆయన పేర్కొన్నారు. లతా మంగేష్కర్‌, సచిన్‌లను తాము గౌరవిస్తామని తెలిపిన మంత్రి వారికి వ్యతిరేకంగా విచారణ జరపబోమని వెల్లడించారు. పలువురి ట్వీట్లకు భాజపా స్క్రిప్టును అందించిందన్న అంశంపైనే విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై మహారాష్ట్ర నిఘా విభాగం దర్యాప్తు జరుపుతోందని వివరించారు. ప్రముఖుల ట్వీట్ల వెనకాల భాజపా ఐటీ సెల్‌ ముఖ్యుడు సహా 12 మంది వ్యక్తుల హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అనిల్‌ దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. 

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌, పాప్‌ సింగర్‌ రిహాన్నా చేసిన ట్వీట్లపై దేశ ప్రముఖలు స్పందిస్తూ ఇటీవల ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్ల కోసం కొందరు ఆ ప్రముఖులపై ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని