రిపబ్లిక్‌ డే: ఈసారి విదేశీ ముఖ్య అతిథి లేరు

ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులు ఎవరూ లేరని కేంద్రం వెల్లడించింది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ దేశాధినేతా ముఖ్యఅతిథిగా......

Published : 14 Jan 2021 21:28 IST

కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడి

దిల్లీ: ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులు ఎవరూ లేరని కేంద్రం వెల్లడించింది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ దేశాధినేతా ముఖ్యఅతిథిగా ఉండరాదని నిర్ణయించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు.  జనవరి 26న రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఆహ్వానించగా.. అందుకు ఆయన అంగీకరించారు. అయితే, బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌తో పాటు కొవిడ్ 19 ప్రభావం కూడా అధికంగా ఉండటంతో  అక్కడ కఠిన లాక్‌డౌన్‌ విధించారు. దీంతో బ్రిటన్‌ ప్రభుత్వం బోరిస్‌ భారత్‌ పర్యటనను రద్దు చేసింది. దీంతో తాను భారత పర్యటనకు రాలేకపోతున్నానంటూ బోరిస్‌ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

భారత్‌లో 109కు చేరిన కరోనా కొత్తరకం కేసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు